NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అవినీతికి తావులేకుండా  ప్రజల సంతృప్తిస్తాయిని పెంచేలా అధికారులు పనిచేయాలి

1 min read

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్

అవినీతికి తావు లేకుండా రిజిస్ట్రేషన్ సేవలుండేలా  జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలి

జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: పెన్షన్లు,రేషన్ పంపిణీ, అన్నా క్యాంటీన్ల నిర్వహణ, రైతులకు, ఆసుపత్రులలో రోగులకు సేవలు, తదితర అంశాలలో ప్రజల సంతృప్తి స్థాయిని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కు తెలియజేసారు.    ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం పెన్షన్లు, రేషన్ పంపిణీ, రిజిస్ట్రేషన్,, ప్రభుత్వ  ఆసుపత్రులలో వైద్య సేవలు, ఆర్టీసీ, ధాన్యం సేకరణ, రైతులకు సేవలు,తదితర  ప్రభుత్వ సేవలలో ప్రజల సంతృప్తి స్థాయి, కలెక్టర్ల కాన్ఫరెన్స్ సంసిద్ధత  అంశాలపై  జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ వెట్రిసెల్వి సీఎస్ కి వివరించారు.  ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ పెన్షన్లు,రేషన్ పంపిణీ, రిజిస్ట్రేషన్, ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్య సేవలు వంటి   ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతీ సేవలలోనూ అవినీతికి తావులేకుండా  ప్రజల సంతృప్తిస్తాయిని పెంచేలా అధికారులు పనిచేయాలని, లబ్ధిదారుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు.    డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు,   డిఆర్డిఏ పీడీ ఆర్. విజయరాజు, డిఎంహెచ్ఓ పి .జె. అమృతం,  సిపిఒ వాసుదేవరావు, డిఎస్ఓ విలియమ్స్, పౌర సరఫరాల సంస్థ డిఎమ్ మూర్తి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ త్రినాధ్ బాబు, ఆర్టీసీ ఆర్ఎం షబ్నమ్,  ప్రభృతులు పాల్గొన్నారు.

About Author