‘జగనన్న ఇళ్లు’ విజయవంతం చేద్దాం..
1 min read– మహిళా సర్పంచ్లకు సూచించిన జేసీ (హౌసింగ్) నారపు రెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల్లో ఒకటైన జగన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)నారపు రెడ్డి మౌర్య మహిళా సర్పంచ్లకు పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని జీవ సుధ ట్రైనింగ్ సెంంటర్లో కోడుమూరు , నందికొట్కూరు నియోజకవర్గాల్లోని మహిళా సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. మూడు రోజుల ప్రాథమిక శిక్షణలో భాగంగా మొదటి రోజు జాయింట్ కలెక్టర్ ( హౌసింగ్) నారపు రెడ్డి మౌర్య ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా సర్పంచ్లకు సలహాలు, సూచనలు ఇచ్చారు. జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డిపిఓ, డిల్ డి ఓ కర్నూల్, డి ల్ పి ఓ కర్నూల్, ఈ ఓ పి ర్ డి కర్నూల్, తదితరులు పాల్గొన్నారు.