NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెద్ద హరివాణం వద్దు – హొళగుందే ముద్దు!

1 min read

గ్రామ ప్రజల అభిప్రాయం తుంగలో తొక్కితే సహించం!

హొళగుంద న్యూస్ నేడు : అవకాశవాద రాజకీయ నాయకుల కుట్రలు సాగవు!అవకాశవాద రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం మా గ్రామాల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే ఊరుకోబోమని గజ్జెహళ్లి, వందవాగిలి గ్రామ ప్రజలు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. గ్రామ ప్రజల అభిప్రాయం లేకుండా హొళగుంద మండలంలో ఉన్న గ్రామాలను పెద్ద హరివాణం మండలంలోకి కలపాలనే ప్రయత్నాలు పూర్తిగా ప్రజావ్యతిరేకమని మండిపడ్డారు.గ్రామ ఎంపీటీసీ కెంచప్ప మాట్లాడుతూ… ప్రశాంతంగా అభివృద్ధి దిశగా సాగుతున్న మా గ్రామాలను రాజకీయ లాభాల కోసం బలి చేయాలనే దురుద్దేశంతో కొందరు నాయకులు తెరవెనుక పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు.ఈ కుట్రలను నిరసిస్తూ ఆరు రోజుల క్రితం 300 ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి, ఆదోని సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించామని తెలిపారు. మా గ్రామాలకు జరుగుతున్న అన్యాయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చూస్తున్న మా గ్రామాలను ఇతర మండలంలోకి కలిపితే అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని హెచ్చరించారు.గ్రామసభ తీర్మానం లేకుండా ఒక్క అంగుళం కూడా కదలనివ్వం!గ్రామ ప్రజల అభిప్రాయం లేకుండా మండల మార్పు జరిగితే ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో స్పందించిన ఆర్డీవో కూడా గ్రామ తీర్మానం లేకుండా ఇతర మండలంలోకి కలపడం సాధ్యం కాదని తేల్చి చెప్పినట్లు వెల్లడించారు.అదే సమయంలో గ్రామంలోనే ఉన్న కొంతమంది నాయకులు పెద్ద హరివాణం మండలంలోకి కలపాలని ఆర్డీవోను ఆశ్రయించడాన్ని ప్రజా ద్రోహ చర్యగా అభివర్ణించారు. ఇలాంటి ప్రయత్నాలను గ్రామ ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని స్పష్టం చేశారు.కర్ణాటక సరిహద్దులో ఉన్న మా గ్రామాలకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు మంజూరు చేసి తక్షణమే అభివృద్ధి చేయాలని, అలాగే గజ్జెహళ్లి నుంచి హొళగుంద వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

About Author