ఏసీబీ వలలో ఉత్తమ సర్పంచ్
1 min readవికారాబాద్; వికారాబాద్ జిల్లా మన్నెగూడ సర్పంచ్ ఏసీబీ వలకు చిక్కాడు. భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు హెచ్ఎండీఏ నుంచి అన్ని అనుమతులు పక్కాగా ఉన్నా.. ఓ వ్యక్తిని 13 లక్షలు డిమాండ్ చేశాడు మన్నెగూడ సర్పంచ్ వినోద్ గౌడ్. దీంతో విసుగెత్తిపోయిన సదరు వ్యక్తి.. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. ఏసీబీ అధికారుల పన్నిన వలలో అడ్డంగా చిక్కిపోయాడు. ఏసీబీ అధికారులు సర్పంచ్ వినోద్ గౌడ్ ను అరెస్టు చేశారు. వినోద్ గౌడ్ గత ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సర్పంచ్ గా పురస్కారం కూడ అందుకున్నారు.