15 వేల ఏళ్లనాటి వైరస్ లు !
1 min readపల్లెవెలుగు వెబ్ : 15 వేల ఏళ్లనాటి వైరస్ లను అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. టిబెట్ పీఠభూమి పై ఉన్న హిమనీనదంలోని మంచు నమూనాల్లో వీటిని గుర్తించారు. పశ్చిమ చైనాలోని 22 వేల అడుగుల ఎత్తులో ఉన్న గులియా మంచు పర్వతం నుంచి రెండు మంచు కోర్ నమూనాలను శాస్త్రవేత్తలు సేకరించారు. శికరాగ్రం నుంచి 1017 అడుగుల లోతు నుంచి వీటిని తీసుకొని..పరిశీలన జరిపారు. అందులో 33 వైరస్ లను గుర్తించారు. వీటిలో 28 వైరస్ ల గురించి మానవాళికి తెలియదు. గడ్డ కట్టి ఉండటం వల్ల ఇవి భద్రంగా ఉన్నాయని, ఇవి మెక్కలు లేదా మట్టి నుంచి వచ్చి ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వాతావరణ మార్పుల వల్ల మంచు కరుగుతున్న నేపథ్యంలో మంచులో ఉన్న వైరస్ ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు.