భక్తిశ్రద్ధలతో.. శ్రావణ మాసోత్సవం..
1 min read– కోవిడ్ నిబంధనలు తప్పనిసరి..
– ఆలయ ఈఓ వాణి
పల్లెవెలుగు వెబ్, కౌతాళం: ఆగస్టు 9 నుంచి ప్రారంభమయ్యే శ్రీశ్రీశ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాసోత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు ఆలయ ఈఓ వాణి. శ్రావణమాసోత్సవాల సందర్భంగా సోమవారం కౌతాళం మండలం ఉరకుంద గ్రామంలో 2021 సంవత్సరం శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా సమన్వయ సమావేశం జరిగింది. సమావేశానికి ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ రెడ్డి, నాయకులు దేశాయ్ కృష్ణా, సి.ఐ పార్థసారథి, ఎంపీడీఓ సూర్యనారాయణ, ఆలయ అధికారి వాణి, తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, ఎస్.ఐ మన్మధ విజయ్,గ్రామ సర్పంచ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా స్వామి వారి దర్శనం ఉంటుందని, భక్తులు మాస్క్, శానిటైజర్, సామాజిక దూరం పాటించాలన్నారు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి థర్డ్ వేవ్ సూచలు వస్తే… స్వామివారి దర్శనం నిలుపుతామని ఈ సందర్భంగా ఆలయ ఈఓ వాణి స్పష్టం చేశారు.