నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఊగిసలాటతో ప్రారంభమైన ట్రేడింగ్.. ఓ దశలో లాభాల్లోకి వెళ్లింది. కీలక కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడితో తర్వాత నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 123 పాయింట్ల నష్టంతో.. 52,852 స్థాయిలో ట్రేడింగ్ ముగించగా.. నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 15,824 వద్ద ట్రేడింగ్ ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 84 పాయింట్ల నష్టంతో 34,949 స్థాయి వద్ద ట్రేడింగ్ ముగించింది.