NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువతకు స్ఫూర్తి ప్రదాత వివేకానందుడు

1 min read

వెలుగోడు , న్యూస్​ నేడు:  జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వెలుగోడు పట్టణం లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎబివిపి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ముందుగా పట్టణం లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆతర్వాత ఎ బివిపి కార్యాలయం లో అందరూ హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథులు మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ప్రేరణగా నిలిచిన మహానుభావుడని, ఆయన బోధనలు నేటి యువత జీవితంలో అమలైతే దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. యువత తమ శక్తిని సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, కష్టపడితే ఏదైనా సాధ్యమని స్వామి వివేకానంద చెప్పిన మాటలు నేటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని సూచించారు.ఈ కార్యక్రమం లో కృష్ణార్జున రెడ్డి , రాజశేఖర్ రెడ్డి , నూలు నాగేశ్వర రావు , ప్రతాప్ ఆచారి వడ్డీ సుంకన్న లాలం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author