జీవితంలో ఎదురైన అడ్డంకులు అధిగమించి,ఏకాగ్రతతో నచ్చిన అంశంల పై దృష్టి పెట్టండి
1 min read
ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ నక్క సూర్యచంద్రరావు
వందరోజుల బాల్యవివాహాల నిర్మూలన అంశంపై సిడిపిఓ డా:సూర్య చక్రవేణి ప్రజ్ఞ చేయించారు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జీవితంలో ఎదురైన అడ్డంకులు ను అధికమించి ఏకాగ్రత తో నచ్చిన అంశం పైన దృష్టి పెట్టండి,జీవితం లో మంచిగా స్థిరపడటానికి మీ కాళ్ళ పైన మీరు నిలబడి మరికొందరికి స్పూర్తిగా ఉండాలని అడిషనల్ ఎస్ పి (ఎడ్మిన్) ఎన్.సూర్య చంద్ర రావు తెలియజేశారు.ఏలూరు మండల సమావేశం మందిరంలో సోమవారం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్-ఏలూరు, చైల్డ్ రైట్స్ అడ్వకేటివ్ ఫౌండేషన్- (క్రాఫ్) సి ఏ ఆర్ ఎఫ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన మరియు ఇప్పటి వరకూ బాల్య వివాహాలు నిలుపుదల చేసిన బాలికలు వారి కుటుంబ సభ్యులు తో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు పరిధిలో పాఠశాలలో మరియు కాలేజీలులో చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. సిడిపిఓ డాక్టర్: సూర్య చక్రవేణి వందరోజుల బాల్య వివాహ నిర్మూలన అంశంపై వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏఎల్ఎస్ఓ నాగేశ్వరరావు,మిషన్ కో-ఆర్డినేటర్ తులసి,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ పుచ్చల వెంకటేశ్వరరావు,చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఫ్రాన్సిస్ తంబి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


