సన్నబడితే… డిస్కౌంట్లు,కూపన్లు !
1 min readపల్లెవెలుగు వెబ్ : కరోన కారణంగా కొన్నినెలల పాటు ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. ఇంట్లో కూర్చుని తినడం మొదలుపెట్టారు. దీంతో బరువు పెరిగిపోయారు. ఇప్పుడు ఇదే ప్రధాన సమస్యగా మారింది. లండన్ లో నిర్వహించిన సర్వేలో 41 శాతం మంది తాము లావైనట్టు తెలిపారు. దీంతో దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున సన్నబడాలని ఆ దేశ జాతీయ ఆరోగ్య సేవల సంస్థ సూచించింది. టీవీల్లో వచ్చే జంక్ ఫుడ్ ప్రకటనలపై నియంత్రణ విధించింది. ఆహారపదార్థాల్లోని కేలరీల విలువ తెలియజేసే పోస్టర్లు అతికించాలని హోటళ్లు, రెస్టారెంట్లను ఆదేశించింది. బ్రిటన్ పౌరులు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు అలవరుచుకుంటే.. వారికి నగదు ప్రోత్సాహకాలు, డిస్కౌంట్లు, కూపన్లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని ప్రజలకు సూచించింది.