గ్రామవాలంటీర్ల సేవలు అభినందనీయం
1 min read– వైఎస్ఆర్ సీపీ యువ నాయకుడు మాదినేని లోకేష్
పల్లెవెలుగు వెబ్, చిట్వేలి: ప్రజా సమస్యలను త్వరగా.. వేగంగా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిందన్నారు వైసీపీ యువ నాయకుడు మాదినేని లోకేష్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలుపథకాలను ప్రజలకు వర్తింపజేయడంలో వాలంటీర్ల సేవలు అభినందనీయమని అని కొనియాడారు. సోమవారం మండలంలోని రాజుకుంట సచివాలయం పరిధిలోని 100 మందికిపైగా ఇంటి పట్టాలు పంపిణీ …. 90 మందికిపైగా కొత్త పెన్షన్లు మంజూరు …. అమ్మ ఒడి పథకం సంబంధించి 890 మందికి చేయూత జగనన్న విద్యా దీవెన సంబంధించి 43 మందికి చేయూత ..జగన్ అన్న వసతి దీవెన సంబంధించి 45 మందికి చేయూత వైయస్సార్ కాపు నేస్తం సంబంధించి 45 మంది మహిళలకు చేయూత వైయస్సార్ చేయూత పథకం సంబంధించి 83 మందికి చేయూత వైఎస్సార్ రైతు భరోసా సంబంధించి 890 మంది రైతులకు ఆర్థిక సహాయం వైయస్సార్ వాహన మిత్ర ద్వారా 12 మందికి ఆర్థిక సాయం తదితర పథకాలకు ప్రజలకు చేరవేస్తున్నారన్నారు.