2026 ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: 80 కేజీల బాడీ బిల్డింగ్ విభాగంలో 2026 ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ సాధించిన సీసం గుంతల గ్రామము డోన్ నియోజకవర్గానికి చెందిన కే వినోద్ కుమార్ కి కర్నూలు జిల్లా జై జవాన్ వెల్ఫేర్ అసోసియేషన్ బృందం వారిని గుర్తించి గౌరవ పురస్కారంతో సన్మానం చేశారు.అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాలో వినోద్ కుమార్ ని స్ఫూర్తిగా తీసుకొని మరి ఎంతో మంది యువతరం ఇలాంటి ఉత్తమ ఆశయాలని నిరంతర సాధనతో వారి యొక్క ఆశయాలను ఎంతో పట్టుదలతో ఎంతో నిబద్ధతతో వారు అనుకున్నది సాధించేవరకు ప్రేమిస్తూనే ఉంటూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని వారి బృందం ముఖ్య సభ్యులు మరియు కార్యక్రమంలో పాల్గొన్న మహానుభావులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మరియు సభ్యులు.

