మద్యపాన నిషేధం అమలు చేయండి యువజన సంఘాల వినతి
1 min read

వైన్స్ దుకాణాల యజమానుల అండదండలతోనే గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాప్ అమ్మకాలు..
కామారెడ్డి , న్యూస్ నేడు : జిల్లా బీబీపేట మండలం మాదాపూర్ గ్రామంలోని యువకులు యువజన సంఘాల నాయకులు కలిసి గ్రామంలో మద్యపాన నిషేధాన్ని పూర్తి అమలు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ హరీష్ కుమార్ యాదవ్ పంచాయతీ సెక్రెటరీ గంగుబాయిలకు కలిసి గ్రామపంచాయతీలో వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ గ్రామంలో యువకులు మత్తు కు బానిసై ఉజ్వల ఆయన భవిష్యత్తును కోల్పోయి అధిక స్పీడ్ తో వాహనాలను నడుపుతూ ఇప్పటికే ఎంతోమంది ప్రమాదాలకు గురజానని వారి కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని జీవించవలసి వస్తుందని ప్రజల ఆరోగ్య భద్రతలను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో మద్యపాన నిషేధం పూర్తిగా అమలు జరగాలని గ్రామ స్వరాజ సుస్థిర స్థాపన గాంధీ కోరుకున్న మార్గంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేసి గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని యువజన సంఘాల నాయకులు హరీష్ సాయికుమార్ గంగారెడ్డి ఉదయపూర్ రాకేష్ రెడ్డి వార్డు సభ్యులు రవీందర్ నరసింహారావు కలిసి ప్రతిపత్రాన్ని విభజన సంఘ నాయకులు అందించారు.

