ఒక రేషన్ కార్డ్.. ఒక పింఛన్ !
1 min readపల్లెవెలుగు వెబ్: ఒక రేషన్ కార్డుకు ఒక పింఛను విధానాన్ని పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఓ మహిళ తన తండ్రి చనిపోయాడని..తన తల్లికి వితంతు ఫించన్ కు దరఖాస్తు చేయగా ఆమె తల్లికి మంజూరు కాలేదు. సదరు మహిళ అత్తకూడ ఫించన్ వస్తోంది. ఆ మహిళ అత్త వారి రేషన్ కార్డులో ఉన్న కారణంగా పింఛన్ మంజూరు కాలేదని అధికారులు తెలిపారని ఆ మహిళ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఒకే కుటుంబంలో రెండు ఫించన్లు తీసుకునే వారు ఉంటే.. ఆధార్, ప్రజా సాధికారిక సర్వేల ఆధారంగా ప్రభుత్వం ఒక ఫించను రద్దు చేస్తుందని మంత్రి తెలిపారు. అయితే దివ్యాంగులకు, పక్షవాతం, డయాలసిస్ రోగులకు మినహాయింపు ఉందన్నారు.