ఒలంపిక్స్.. ముగించాలన్న తాపత్రయమే !
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన కారణంగా ఒలంపిక్స్ లో సందడి కనిపించడం లేదని భారత రోయింగ్ జట్టు కోచ్, తెలుగు వ్యక్తి ద్రోణాచార్య , ఇస్మాయిల్ బేగ్ అన్నాడు. ఎలాగోలా క్రీడలు ముగించాలన్న తాపత్రయమే కనిపిస్తోందన్నారు. భారత రోయింగ్ జట్టు సెమీస్ కు చేరుకోవడంతో తమ లక్ష్యం నెరవేరిందన్నారు. సిడ్నీ నుంచి టోక్యో వరకు ఆరు ఒలంపిక్స్ లకు అర్హత సాధించిన భారత జట్టుకు బేగ్ కోచ్ గా వ్యవహరించాడు. 5 ఒలంపిక్స్ లు ప్రత్యక్షంగా చూశాడు. ఒలంపిక్స్ లో కరోన తీవ్రత అధికంగా ఉన్న దేశాలపై ఆంక్షలు విధించారని, వారిని క్రీడా గ్రామంలోని రెండో అంతస్థులో ఉంచారని తెలిపారు. క్వారంటైన్ పూర్తి అవ్వగానే మిగిలిన దేశాల లాగే వసతి కల్పించారని బేగ్ చెప్పారు. ప్రతి పది అడుగులకు ఒక శానిటైజర్, థర్మా మీటర్ ఏర్పాటు చేశారని, ప్రతి వ్యక్తికి మాస్క్ తప్పనిసరి అని బేగ్ వివరించారు.