బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ దారులకు భరోసా
1 min readపల్లెవెలుగు వెబ్ : కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయంతో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు భరోసా లభించనుంది. ఇప్పటి వరకు లైసెన్సులు రద్దయి, బ్యాంక్ లిక్విడేషన్ కు వెళ్లినపుడు లభించే బీమా రక్షణ .. ఇక నుంచి మారటోరియం విధించిన బ్యాంకులకు వర్తించనుంది. డీఐసీజీసీ 1961 చట్టసవరణకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గత ఏడాది లక్ష వరకు ఉన్న డిపాజిట్ ఇన్సూరెన్స్.. 2020లో 5 లక్షలకు పెంచారు. ఇది పూర్తీగా లిక్విడేషన్ ప్రక్రియలోకి వెళ్లినపుడే వర్తిస్తుంది. ఇటీవల పీఎంసీ బ్యాంక్, లక్ష్మి విలాస్ బ్యాంక్, యస్ బ్యాంక్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వీటిపై ఆర్ బిఐ పాక్షికంగా మారటోరియం విధించడంతో డిపాజిట్ దారులు తీవ్రంగా ఆందోళనకు లోనయ్యారు. తాజా నిర్ణయంతో ఇలాంటి సందర్బాల్లో కూడ భరోసా లభిస్తుంది.