‘ ఆలిండియా సైనిక్ స్కూల్ ’ లో మెరిసిన ఆణిముత్యాలు
1 min read– తెలుగు రాష్ట్రాలలో మురళి కోచింగ్ విద్యార్థుల ప్రభంజనం
పల్లెవెలుగు వెబ్, రాయచోటి : ఆలిండియా సైనిక్ స్కూల్ తుది జాబితా ఫలితాలలో రాయచోటి పట్టణానికి చెందిన మురళి సైనిక్ అండ్ నవోదయ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. చిత్తూరు జిల్లా కలికిరి సైనిక్ స్కూల్ లో బాలికలతో కలిపి విడుదల చేసిన తుది జాబితా ఫలితాలలో మొత్తం 70 మందికి గాను తెలుగు రాష్ట్రాల నుండి 50 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అందులో మురళి కోచింగ్ సెంటర్ విద్యార్థులే 10 మంది ఎంపిక కావడం తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఈ ప్రాంత వాసులు గర్వ కారణంగా చెప్పుకుంటున్నారు.
గత 5 సంవత్సరాలుగా రాయచోటి మురళీ సైనిక్ అండ్ నవోదయ కోచింగ్ సెంటర్ నుండి ప్రతి ఏడాది 5 నుండి 15 మంది చొప్పున ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశానికి ఎంపికవుతూనే ఉన్నారు. అలాగే గత ఏడాది కర్ణాటక రాష్ట్రంలోని కిట్టూరు బాలికల సైనిక్ పాఠశాలకు మురళి కోచింగ్ సెంటర్ నుండి 12 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరయితే 12 మంది ఎంపిక కావడం విశేషం. తాజాగా ఈ ఏడాది కలికిరి సైనిక్ పాఠశాలకు, కర్ణాటక లోని కొడుగు సైనిక్ పాఠశాల ప్రవేశానికి 20 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మెడికల్ టెస్టులు, ఇంటర్వూలు నిర్వహించిన అనంతరం గురువారం కలికిరి సైనిక్ స్కూల్ విడుదల చేసిన తొలి జాబితాలో మురళి సైనిక్ కోచింగ్ సెంటర్ నుండి 10 మంది విద్యార్థులు ఎంపిక కావడంతో రాయచోటి పేరు ఒక్కసారిగా ఆలిండియా స్థాయిలో నిలిచింది. ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి, కరస్పాండెంట్ సరితాదేవి కి,సహకరించిన పిల్లల తల్లిదండ్రులకు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కొండూరు మురళీ మోహన్ రాజు అభినందనలు తెలియజేశారు.