వాటా కోసం హిజ్రాల గొడవ
1 min readపల్లెవెలుగు వెబ్ : అనంతపురంలో హిజ్రా గ్రూపుల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. వసూళ్లలో వాటా కోసం ఇరు వర్గాల హిజ్రాలు కొట్టుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలోని హైదరాబాద్ హిజ్రా సంఘాలకు కాకుండా.. రాయలసీమలోని హిజ్రా గ్రూపులకు అనంతపురం హిజ్రాలు వసూళ్లలో వాటా కొంత చెల్లిస్తున్నారు. బుధవారం రాత్రి అనంతపురం జీసెస్ నగర్ లో ఓ కళ్యాణమండపంలో హిజ్రాలు ఉలిగమ్మ జాతర నిర్వహించారు. ఈ జాతరకు హైదరాబాద్, బెంగళూరుకు సంబంధించిన హిజ్రా సంఘ ప్రతినిధులు హాజరయ్యారు. వసూళ్లలో వాటా ఎందుకు పంపలేదని హైదరాబాద్ కు చెందిన హిజ్రా సంఘ ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో గొడవ మొదలైంది. అనంతపురానికి చెందిన శర్మాస్ పై బెంగళూరు, హైదరాబాద్ చెందిన హిజ్రాలు దాడి చేశారు. తమ నాయకుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని అనంతపురం హిజ్రాలు ఆందోళ చేశారు. కలెక్టరేట్ ఎదుట గురువారం నిరసన తెలిపారు. దీనికి సంబంధించి నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.