NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వెంకటాంపల్లె లో ఘనంగా బండలాగుడు పోటీలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండల పరిధిలోని వెంకటాంపల్లె లో వెలిసిన భవాని శంకర స్వామి 10వ వార్షికోత్సవం  సందర్భంగా శనివారం ముఖ్య అతిథులుగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసుర ప్రకాశ్ రెడ్డి ఆహ్వానించారు. సుంకర నాగార్జున కుమార్ ఆహ్వాన మేరకు ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి హాజరై భవాని శంకర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బండలాగుడు పోటీలు ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ విజేతలకు బహుమతులు అందించేందుకు సుంకర నాగార్జున కుమార్ ఆహ్వానించారు. ఆయన ఆహ్వాన మేరకు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ వెంకటాంపల్లికి చేరుకుని ముందుగా భవాని శంకర్ స్వామికి పూజలు నిర్వహించి పోటీలో గెలుపొందిన వారికి ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ పోటీలో పది జేతలు వృషభరాశుల పాల్గొన్నాయి.అందులో ఆరు జేతలను వృషభరాశులను ఎంపిక చేసి మొదటి బహుమతి అక్షర రెడ్డి  రాయవరం నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.(దేశముదురు గబ్బర్ సింగ్ 50వేలు రెండవ షేక్ మహమ్మద్ పరిధ్  ఏ.నారయణపురం అనంతపురం జిల్లా.(బుల్లెట్ రాకెట్) 40వేలు,మూడవ దుబ్బన్న  కోత్తపల్లి కర్నూలు జిల్లా 30వేలు,నాలుగవ దుబ్బన్న  కోత్తపల్లి కర్నూలు జిల్లా కంబైన్డ్ చిన్న రంగుడు కంబాలపాడు కర్నూలు జిల్లా 20 వేలు బహుమతి,ఐదవ విజేతగా గుండం చెన్నారెడ్డి  కానాల నంద్యాల జిల్లా.(రాఖబాయ్ మున్నాభాయ్) 10వేలు,ఆరవ ఎం.ధనుష్ రెడ్డి  రాయవరం నాగర్ కర్నూల్ జిల్లా కంబైన్డ్ S.మహమ్మద్ రఫీ భాషా  నూతనపల్లి కర్నూలు జిల్లా 50వేలు బహుమతులు లను మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్యాపిలి మండల ఇన్చార్జి ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి, తేదేపా సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ యాదవ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు,  మండల కన్వీనర్ మెట్టుపల్లి సుదర్శన్, మాజీ ఎంపీటీసీ గొల్ల రామ్మోహన్ యాదవ్, ప్రిన్సిపాల్ మధు ,మరియు వెంకటాం పల్లి గ్రామస్తులు ఎస్ రాముడు, ప్రభాకర్, ప్రకాష్ ,మోహన్, సీస గుంతల కాంతు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author