PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాడు తెర వెనుక.. నేడు తెరపై

1 min read

సినిమా డెస్క్​ : వందకు పైగా చిత్రాలు తెరకెక్కించారు. వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ని నటులుగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. ఆయన ఇన్నాళ్లు తెర వెనుక ఎంతోమందితో నటింపజేసిన ఆయన, ఇప్పుడు తనే ఓ నటుడిగా తెర ముందుకొస్తున్నారు. ‘పెళ్లిసందD’ చిత్రం ద్వారా నటుడిగా ఎంట్రీ ఇస్తున్నారు రాఘవేంద్రరావు. విశిష్ట అనే పాత్రలో ఆయన్ని పరిచయం చేస్తూ నిన్న ఓ వీడియోని విడుదల చేశారు. రాజమౌళి ఈ వీడియోని ట్వీట్ చేశారు. సూటు, బూటు, గాగూల్స్‌తో సూపర్ స్టైలిష్ గా రాఘవేంద్రరావు కనిపిస్తున్నారు. ఆయన సూపర్ విజన్ లో గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తోంది. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.

About Author