NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గృహ నిర్మాణ శాఖలో ప్రతిభ కనబరిచిన టెక్నికల్ ఎక్స్పర్ట్

1 min read

జి.పుష్ప కుమార్ కి ఉత్తమ మహిళా అవార్డు

అవార్డు అందజేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రపంచ మహిళ దినోత్సవం సందర్బంగా  సి.ఆర్  రెడ్డి ఆడిటోరియం లో ఆదివారం మహిళ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా గా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన మహిళ ఉద్యోగులను ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రిసెల్వి సర్టిఫికెట్ ప్రధానం చేశారు. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ లో ప్రతిభ కనపరుచిన టెక్నికల్ ఎక్స్పర్ట్ శ్రీమతి గోనమండ పుష్పకుమారి కి ఉత్తమ మహిళా అవార్డు సర్టిఫికెట్ ని అందచేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, విధి నిర్వహణలో ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో బాధ్యతాయుతంగా పనిచేస్తే గుర్తింపు దానంతట అదే వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author