NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చేతిపంపుకు మరమ్మతులు..

1 min read

మరమత్తు చేపట్టిన టిడిపి యువ నాయకుడు పెద్దహ్యాట మల్లి

హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండల పరిధిలోని పెద్దహ్యాట గ్రామంలో స్థానిక సుంకులమ్మ దేవి ఆలయం ప్రక్కన ఉన్న చేతిపంపు గత ఐదు నెలలుగా చెడిపోయి మరమ్మత్తుకు నోచుకోకుండా నిరుపయోగంగా ఉండేది. ఆలూరు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు వేసవికాలంలో నీటి ఎద్దడితోపాటు ఈ నెల 24,25 తేదీలలో గ్రామంలో దేవర ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని గ్రామ టిడిపి యువ నాయకుడు మల్లి చేతిపంపుకు మరమ్మత్తులు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 నెలలుగా చేతిపంపు మరమ్మతుకు నోచుకోక నిరుపయోగంగా ఉండడంతో, త్వరలో గ్రామ దేవర ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఉత్సవాలకు వచ్చే వేలాదిమంది భక్తులకు నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు చేతి పంపుకు మరమ్మతులు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా వేసవికాలంలో గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో హనుమంతప్ప,తరుణ్, తిరుపతి,మల్లి, గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author