NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ దేవి వసంత నవరాత్రులు సందర్భంగా ప్రాతః కాలంలో విశేష పూజలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో కర్నూలు  శ్రీ సూర్యనారాయణ దేవాలయంలో శ్రీ మహా గౌరీ అమ్మవారికి శ్రీ దేవి వసంత నవరాత్రులు సందర్భంగా రెండవ రోజు  ప్రాతః కాలంలో విశేష అర్చనలు , అభిషేకములు  జరిగినవి .అనంతరం  మండపారాధన   మరియు దేవి ఖడ్గ మాల సహస్రనామ పూజలు జరిగినవి. అనంతరం చండి హోమం జరిగినది  తిరిగి సాయంకాలం ప్రదోషకాల అర్చన ,లలితా సహస్రనామ  పూర్వక  సామూహిక కుంకుమ అర్చనలు జరిగినవి .అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

About Author