ఆగస్టులో మార్కెట్లోకి 5 ఫార్మా ఐపీవోలు
1 min readపల్లె వెలుగు వెబ్ : ఆగస్టులో స్టాక్ మార్కెట్లో ఫార్మా కంపెనీలు క్యూ కడుతున్నాయి. నిధుల సమీకరణకు సమాయత్తమవుతున్నాయి. ఐదు కంపెనీలు ఐపివోలతో మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ ఐదు కంపెనీలు 8 వేల కోట్లకు పైగా నిధులు సమీకరించనున్నాయి. ఈ ఐదు కూడ ఫార్మా కంపెనీలు కావడం గమనార్హం. బెయిన్ క్యాపిటల్ కు చెందిన ఎంక్యూర్ ఫార్మానే 4000 కోట్లకు పైగా సమీకరించనుంది. విజయా డయాగ్నోస్టిక్ సెంటర్ 1500 కోట్లు, కృష్ణ డయాగ్నోస్టిక్స్ 1200 కోట్లు, సుప్రీయ లైఫ్ సైన్సెస్ 1200 కోట్లు, విండ్ లాస్ బయోటెక్ 400 కోట్లు ఆగస్టు నెలలో సమీకరించబోతున్నాయి.