PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ల‌గ్జరీ అపార్ట్ మెంట్లలో పందుల పెంప‌కం !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : పంది మాసం కొర‌త‌ను అధిగ‌మించేందుకు చైనా వినూత్న రీతిలో పెంప‌కాన్ని చేప‌ట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా 13 అంత‌స్థుల ల‌గ్జరీ అపార్ట్ మెంట్ నిర్మించింది. ఈ భ‌వ‌నంలో ప‌టిష్టమైన భ‌ద్రత‌, ఆరోగ్య స‌దుపాయాలు, పౌష్టికాహారంతో కూడిన వంట‌లు తయారు చేస్తున్నారు. క్రిమిర‌హిత వాతావ‌ర‌ణం కోసం.. ఈ ప‌నులన్నీ చేయ‌డానికి రోబోల‌ను ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం చైనాలో విజృంభించిన ఆఫ్రిక‌న్ స్వైన్ ఫ్లూ కార‌ణంగా 40 కోట్ల పందులు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో దేశీయంగా పందుల పెంప‌కం ప‌డిపోయింది. పంది మాంసం కోసం అమెరికా, యూర‌ప్ దేశాల‌పై ఆధార‌ప‌డాల్సి వ‌స్తోంది. ఇదే అదునుగా ఆ దేశాలు పంది మాంసం ధ‌ర‌లు విప‌రీతంగా పెంచేశాయి. దీంతో చైనాలో ద్రవ్యోల్బణం అదుపుత‌ప్పింది. దీనిని గాడిలో పెట్టేందుకు చైనా పందుల పెంపకం మొద‌లు పెట్టింది. గ‌తంలో లాగ కాకుండా వినూత్నమైన ప‌ద్ధతిలో పందుల పెంప‌కం చేప‌ట్టింది. 15ల‌క్షల అడుగుల విస్తీర్ణంలో 1.2 ల‌క్షల పందుల్ని పెంచే కార్పరేట్ నిర్మాణాన్ని చైనా పూర్తీ చేసింది.

About Author