లాభాల్లో సూచీలు.. ఆసియా మార్కెట్లకు భిన్నంగా ర్యాలీ
1 min readపల్లె వెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల తీరుకు భిన్నంగా భారత స్టాక్ సూచీలు కొత్త రికార్డులు నమోదు చేశాయి. అమెరికన్ ఫ్యూచర్స్ గ్రీన్ లో ట్రేడ్ అవుతున్నప్పటికీ.. ఆసియా మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. వీటికి భిన్నంగా సెన్సెక్స్ ఆల్ టైమ్ హై 53,400 స్థాయిని తాకింది. నిఫ్టి 16000 మార్కును చేరింది. 12 గంటల సమయంలో సెన్సెక్స్ 420 పాయింట్ల లాభంతో 53, 369 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో 15,993 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 113 పాయింట్ల స్వల్ప లాభంతో 34,824 వద్ద ట్రేడ్ అవుతోంది. నిప్టీ, సెన్సెక్స్ లు భారీ లాభాలు నమోదు చేయగా.. బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్వల్ప లాభాల్లో కొనసాగుతోంది.