PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బంపరాఫర్‌‌..

1 min read

సినిమా డెస్క్​ : కన్నడ బ్యూటీ నభా నటేష్ ‘నన్ను దోచుకుందువటే’ తో టాలీవూడ్ లో ప్రవేశించింది ​. ‘ఇస్మార్ట్ శంకర్’ తో ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ ‘అల్లుడు అదుర్స్’ భామ నభ బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ సరసన ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఒక ఇంగ్లీష్ సిరీస్ దీనికి మాతృక అని దర్శక నిర్మాతలు నభానటేష్ వైపే మొగ్గు చూపుతున్నారని అధికారిక ప్రకటన కూడా త్వరలో వచ్చే అవకాశం ఉందట. అయితే ఇప్పుడు నభ మరో బంపర్‌‌ చాన్స్‌ కొట్టేసిందని ఇండస్ట్రీ టాక్. ఒక పెద్ద నిర్మాణ సంస్థ రూపొందించే తమిళ సినిమా కోసం బెంగుళూరు భామని సంప్రదించినట్టు అందుకు ఆమె అంగీకరించినట్టు సమాచారం.కన్నడ చిత్రం ‘వజ్రకాయ’ తో నటన వైపు అడుగులేసిన నభ టాలీవుడ్‌లో తన సత్తా నిరూపించుకుంది, అలాగే కోలీవుడ్‌లో కూడా పాగా వేస్తుందేమో చూద్దాం.

About Author