సమస్యలు పరిష్కరిస్తాం..
1 min read– ఇండిపెండెంట్ అభ్యర్థుల గెలుపు.. ఎన్డబ్ల్యూపీ లక్ష్యం
– ఎన్డబ్ల్యూపీ వ్యవస్థాపకురాలు శ్వేతాశెట్టి
పల్లెవెలుగు, కర్నూలు
ఈ నెల 10న జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డబ్ల్యూపీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ వ్యవస్థాపకురాలు శ్వేతాశెట్టి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆది,సోమవారాలలో ఎన్డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్.హసీనాబేగం నేతృత్వంలో ఆమె 15, 47,48 వార్డుల ఇండిపెంంట్ అభ్యర్థుల గెలుపు కోసం పర్యటించారు. ఈ సందర్భంగా శ్వేతాశెట్టి మాట్లాడుతూ నిత్యం అందుబాటులో ఉంటూ… ప్రజా సమస్యలు పరిష్కరించడంతోపాటు మహిళల్లో చైతన్యం తీసుకురావడంలో తమ అభ్యర్థులు ముందుంటారన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు పప్పు..బెల్లంలా సంక్షేమ పథకాల రూపంలో నిధులు వెలజల్లుతోందని ఆరోపించిన శ్వేతాశెట్టి… మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీకి అజెండా అంటూ ఏమీ లేదన్నారు. తమ పార్టీ మద్దతు ఇచ్చిన 15 వార్డు శవల మహదేవమ్మ, 47వ వార్డు జెరదొడ్డి నర్సమ్మ, 48 వ వార్డు భాస్కరమ్మను గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం, నేషనల్ ఉమెన్స్ పార్టీ మహిళా వింగ్ ప్రెసిడెంట్ ఎన్.మేరీ, కొత్తపేట ఇంచార్జ్ ప్రసన్న ,యూత్ ప్రెసిడెంట్ ఇంతియాజ్, కార్యకర్తలు విజయమ్మ, ఎస్.సుజాత, బి.సుజాత, పి.సురేఖ, సిమ్రాన్, అనిత పాల్గొన్నారు.