అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
1 min read– ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్, చిట్వేలి:ప్రభత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వర్తింపజేయడంలో మండల అధికారులు, సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మంగళవారం చిట్వేల్ ఎంపీడీఓ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామపంచాయతీ లో వాలంటీర్ల పనితీరును సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రటరీలు పర్యవేక్షించాలని సూచించారు. సీజనరి వ్యాధులపై అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. వైద్య,విద్య, గృహ,అగ్రికల్చర్, ఆర్టికల్చర్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ సంబంధిత అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాస్ రెడ్డి, ఎల్.వి మోహన్ రెడ్డి, పాటూరి శ్రీనివాసులు రెడ్డి, సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి,ఎంపీడీవో, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు ,అధికారులు ,రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి లింగం లక్ష్మీ కర, మంద సుధాకర్ , మైనారిటీ నాయకులు గులాం భాష కరీముల్లా ఖాన్ ర్రైల్వే కోడూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మంద నాగేశ్వర, హజరత్ రెడ్డి రమణారెడ్డి నవీన్, నాని పాల్గొన్నారు.