‘మత్స్యశాఖ’లో 4 కోట్ల అవినీతి కుంభకోణం
1 min readపల్లెవెలుగు వెబ్, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో సుమారు నాలుగు కోట్ల రూపాయల పైబడి అవినీతి కుంభకోణం బట్టబయలయ్యింది. 2018 నుండి ఇప్పటి వరకు పని చేసిన అధికారుల చేతివాటం చేసినట్లు ఆడిట్ అధికారులు నిగ్గుతేల్చే పనిలో పడ్డారు. పెద్ద మొత్తాలలో చెక్కుల ద్వారా ఇతరత్రా సంస్థలకు బదలయించినట్లు రుజువువైంది. ఈవిషయమై మంగళవారం ఆ శాఖ జేఈ కేవీఎస్ నాగలింగచార్యులు మీడియాతో మాట్లాడారు. బ్యాంకులో జమ చేసిన సొమ్ము, ఇక్కడ ఉండాల్సిన నగదును బ్యాంకు స్టేట్మెంట్ లు సరి చూడగా తేడాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. బ్యాంకు నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోగా వేరే అకౌంట్ క్రియేట్ చేసి దుర్వినియోగం చేసినట్లు తెలిపారు. గత నెల నుండి ఎఫ్ఏసి గా పని చేస్తున్నానని, రాష్ట్ర మరియు పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి… స్థానిక పోలీస్ స్టేషన్లో జూలై 20వ తారీఖున ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదైనట్లు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని జేడీ స్పష్టం చేశారు. గతంలో ఇక్కడ పరిపాలన విభాగం ఇన్చార్జి జె.డిగా పనిచేసి.అనారోగ్యంతో కాలం చేసిన (చనిపోయిన)పద్మనాభ మూర్తి పని చేశారు. అవినీతి కుంభకోణంలో ఎవరెవరు భాగస్వామ్యులయ్యారనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.