NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులు పై రివ్యూ మీటింగ్:”

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: జి.కబర్థి, చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కర్నూలు వారి సూచనల మేరకు బి. లీలా వెంకట శేషాద్రి, సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు వారు కర్నూలు కోర్టు కాంపౌండ్ లో గల న్యాయ సేవా సదన్ నందు “లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులు పై రివ్యూ మీటింగ్”  నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా జడ్జి “లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులు, చట్టపరమైన సలహాలు, జైలు విజిట్లు, కేసుల వివరాలు మరియు పరిష్కారము మొదలగు అంశాలపై సూచనలు చేశారు.అలాగే పెండింగ్ లో గల 71 కేసులలో ఎన్ని కేసులలో బెయిల్స్ మంజూరు చేశారో వాటి కేసుల యొక్క స్థితిగతులను తెలుసుకొని వాటిని ఏ విధంగా త్యరిత గతిన పరిష్కరించాలో అనే దానిపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో   చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్  శివరాం, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్  డిఫెన్స్ కౌన్సెల్ ఏ. సులోచన,సిబ్బంది  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *