అర్థరాత్రి న్యూసెన్స్.. నాగబాబు అల్లుడి పై కేసు
1 min readపల్లెవెలుగు వెబ్ : మెగా డాటర్ నిహారిక అపార్ట్ మెంట్ లో అర్ధరాత్రి రచ్చరచ్చ జరిగింది. నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ న్యూసెన్స్ చేస్తున్నాడంటూ ఒక్కసారిగా కలకలం రేగింది. అపార్ట్ మెంట్ వాసులకు, నిహారిక భర్తకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంతో అపార్ట్ మెంట్ వాసులు చైతన్యపై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అపార్ట్ మెంట్ వాసులపై నిహారిక భర్త కంప్లైంట్ చేశారు. పోలీసులు ఇరువురి ఫిర్యాదులు స్వీకరించి విచారణ చేస్తున్నారు.