ఎమ్మెల్యే చింతమనేని మానవత్వం,సామాన్య వృద్ధుడి పట్ల చూపిన ఔదార్యం
1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: తన సమస్య చెప్పుకోవడానికి ఆటోలో దుగ్గిరాల క్యాంపు ఆఫీస్ కి వచ్చిన 75 ఏళ్ల వృద్ధుడిని చూసి చలించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ఆ పెద్దాయనను తన సొంత కారులో ఎక్కించుకుని,అతని స్వగ్రామం తీసుకెళ్లి ఇంటి వద్దే దింపిన వైనం. ఇది కదా తన ప్రజల పట్ల నాయకుడికి ఉండాల్సిన నిజమైన ప్రేమని పలువురు అభినందించారు.దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన గ్రీవెన్స్ సందర్భంగా పెదవేగి మండలం వంగూరు గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడు మెరుగు సుదర్శన రావు తన సమస్యను చెప్పుకోవడానికి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్దకు వచ్చారు. ఆ వృద్ధుడిని చూడగానే ఎమ్మెల్యే ఎంతో ప్రేమగా పలకరించి, దగ్గరకు తీసుకున్నారు. అయ్యా ఇంత ఎండలో అంత దూరం నుండి ఎందుకు వచ్చావు నేను మీ ఊరి వైపు వచ్చినప్పుడు కారు ఆపి చెప్పవచ్చు కదా అని ఆత్మీయంగా ప్రశ్నించారు. అతని సమస్యను సావధానంగా విని, వెంటనే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.తిరిగి ఎలా వెళ్తావు అని అడగ్గా, ఆ వృద్ధుడు సెంటర్ వరకు నడిచి వెళ్ళి, ఆటోలో ఊరికి వెళ్తానని చెప్పడంతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మనసు చలించింది. ఆ వృద్ధుడి పట్ల తనకున్న అభిమానాన్ని చాటుతూ, స్వయంగా తన అధికారిక కారులో ఆయనతో పాటు ఎక్కించుకుని, వంగూరులోని ఆ వృద్ధుడి ఇంటి వద్ద దింపారు. అలాగే ఇంటి వద్ద వృద్ధుడికి ఉన్న సమస్యను స్వయంగా పరిశీలించి, అందుకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టారు. ఎమ్మెల్యే ప్రభాకర్ ఈ ఉదారతకు ఆ వృద్ధుడు భావోద్వేగానికి గురై సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చింతమనేనికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.


