మంత్రి లక్ష్యంగా బాంబు దాడి
1 min read పల్లెవెలుగు వెబ్ : ఆఫ్గనిస్తాన్ తాత్కాలిక రక్షణ మంత్రి బిస్మిల్లా ఖాన్ మొహమ్మది లక్ష్యంగా బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ దాడి నుంచి మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఆప్గన్ రాజధాని కాబుల్ సమీపంలో ఈ దాడి జరిగింది. దాడి అనంతరం భద్రతా బలగాలు ప్రతి దాడి చేయడంతో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని ఆప్గన్ అధికారులు తెలిపారు. తామే ఈ దాడికి పాల్పడినట్టు తాలిబన్ ప్రతినిధులు ప్రకటించారు.