NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అహంకారానికి, ఆత్మ‌గౌర‌వానికి మ‌ధ్య యుద్ధం !

1 min read

పల్లెవెలుగువెబ్ : భీమ్లానాయ‌క్ సినిమా అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ఒక మడమ తిప్పని యుద్ధమని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన భీమ్లానాయ‌క్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ మంత్రి కేటీఆర్, త‌ల‌సానిశ్రీనివాస్ యాద‌వ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ ఇది మళయాలం చిత్రం. ఒక పోలీసు అధికారికి, రాజకీయ నేపథ్యం ఉండే వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణ. దీనిని యాడాప్ట్ చేసి, చాలా బాగా రచన చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఆయన ఈ సినిమాకి వెన్నెముక. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు అని అన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎక్కడో చెన్నైలో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌కి తీసుకురావాలని ఎందరో పెద్దలు సంకల్పించి తీసుకువచ్చారని, ఈ రోజు ఈ పరిశ్రమని, బంధాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి నాయకత్వంలో మరింత ముందుకు తీసుకువెళ్లేలా ప్రోత్సాహం అందిస్తున్నందుకు ధన్యవాదాలు అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు.

                                       

About Author