PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్పందనకు మెరుగైన రూపం ‘జగనన్నకు చెబుదాం’

1 min read

– ప్రజలకు మరింత సులభ తరంగా ఉండేందుకు, పరిష్కారంలో జవాబుదారీ తనం పెంచేలా ‘జగనన్నకు చెబుదాం’
– 1902కి ఎవరైనా, ఎక్కడి నుంచి అయినా కాల్ చేయవచ్చు
– ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రత్యేక పర్యవేక్షణ
– జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి
– విలేకరుల సమావేశంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : స్పందనకు మెరుగైన రూపమే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం అని, ప్రజలకు మరింత సులభ తరంగా ఉండేందుకు, పరిష్కారంలో జవాబుదారీ తనం పెంచేలా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం అమలు అవుతోందని జిల్లా కలెక్టర్ డా .జి.సృజన వెల్లడించారు.బుధవారం కలెక్టరేట్ లో “జగనన్నకు చెబుదాం” కార్యక్రమం పై జిల్లా కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను మరింత బాధ్యతతో పరిష్కరించేందుకు “జగనన్నకు చెబుదాం” కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించారన్నారు. ఇప్పటివరకు ప్రతి సోమవారం కలెక్టరేట్లోనూ, మండలాల్లోనూ స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి సమస్యలను స్వీకరించడం జరిగిందన్నారు..ఈ కార్యక్రమాన్ని మరింత అప్గ్రేడ్ చేసి ప్రజలకు మరింత చేరువయ్యేలా జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు.ప్రజల సమస్యలను నాలుగు విధాలుగా తెలుపుకోవచ్చని కలెక్టర్ వెల్లడించారు.. ఎప్పటి లాగే స్పందన ద్వారా కలెక్టరేట్లోనూ, మండల కార్యాలయాల్లో సమస్యను రిజిష్టర్ చేసుకుని, రసీదు పొంది సమస్యను తెలుపుకోవచ్చని, మరో పద్ధతి ద్వారా సచివాలయాలకు వెళ్లి సమస్యను ఇవ్వవచ్చని,మరో పద్ధతి లో డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్లి సమస్య తెలుపుకోవచ్చని, ప్రముఖమైన పద్ధతి ‘జగనన్నకు చెబుదాం’ ద్వారా 1902 నంబర్ కు కాల్ చేసి సమస్య ను తెలియ చేయ వచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.జగనన్నకు చెబుదాం ద్వారా 1902కి ఎవరైనా, ఎక్కడి నుంచి అయినా కాల్ చేయవచ్చని, ఇంతకుముందున్న కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఫోన్ కాల్స్ ద్వారా అందిన ఫిర్యాదులను సీఎంఓ కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందన్నారు.. ఇందుకోసం సీఎం కార్యాలయంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేశారని, ఇందులో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను నియమించి, ఫిర్యాదుల పరిష్కారాన్ని ఫాలో అప్ చేయడం జరుగుతుందన్నారు.. జగనన్న చెబుదాం ద్వారా వచ్చిన సమస్యలకు నాణ్యతకు చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.. పరిష్కారం అయిన సమస్య పై కూడా ఆడిట్ చేయడం జరుగుతుందని, ఒక వేళ లబ్ధిదారులకు సంతృప్తి గా లేకపోతే ఆ సమస్యను రీ ఓపెన్ చేసి ఆ సమస్య ను పై అధికారి వద్దకు పంపడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. రూల్ ప్రకారం లేకపోతే ఏ కారణంగా చేయలేకపోతున్నాం అనే విషయాన్ని పూర్తి వివరంగా ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇదే విధంగా జిల్లా, మండల, సచివాలయం స్థాయిల్లో కూడా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క గ్రీవెన్స్ కు ఐడి జనరేట్ చేయడం జరుగుతుందని, దీన్ని వైయస్సార్ ఐడి (యువర్ సర్వీస్ రిక్వెస్ట్) గా పిలువబడుతుందన్నారు. ఈ ఐడి ద్వారా www.jkc.ap.gov.in వెబ్సైట్ లో గ్రీవెన్స్ ఏ అధికారి వద్ద ఉందని, ఏ స్టేటస్ లో ఉందో ట్రాక్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు..ప్రజలకు ఈ కార్యక్రమం చాలా చేరువగా ఉందని, సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.. సచివాలయాలు,వాలంటీర్లు ద్వారా ఈ కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తామని కలెక్టర్ వివరించారు..విలేకరుల సమావేశంలో డి ఆ ర్వో నాగేశ్వరరావు పాల్గొన్నారు.

About Author