అమెజాన్ కు గట్టిదెబ్బ !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్ గ్రూప్‌తో 2019లో కుదిరిన ఒప్పందానికి గతంలో ఇచ్చిన అనుమతిని కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది. రెగ్యులేటరీ అనుమతి కోరే సమయంలో అమెజాన్ కొన్ని వివరాలను దాచిపెట్టిందని సీసీఐ పేర్కొంది. డీల్‌ను మళ్లీ కొత్తగా పరిశీలించాల్సి ఉందని 57 పేజీల లేఖలో పేర్కొంది. అప్పటి వరకు ఈ డీల్ నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టంచేసింది. అలాగే, అమెజాన్‌కు రూ.202 కోట్లు జరిమానా విధించింది. ఫ్యూచర్ గ్రూప్ విషయంలో న్యాయపోరాటం సాగిస్తున్న వేళ సీసీఐ నిర్ణయం అమెజాన్‌ను ఇరకాటంలో పెట్టింది.