పుంజుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థ
1 min readపల్లెవెలుగువెబ్ : భారత దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోల్చినపుడు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 13.5 శాతం అధిక వృద్ధి నమోదైంది. జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో ఇది 4.1 శాతం ఉండేది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ బుధవారం విడుదల చేసిన వివరాల ప్రకారం, జూన్ 30తో ముగిసిన మూడు నెలల్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోల్చినపుడు 13.5 శాతం అధిక వృద్ధి రేటు నమోదైంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అనంతరం 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అత్యధికంగా 20.1 శాతంగా నమోదైంది.