మధ్యతరగతి ప్రజలకు వరం .. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్
1 min readపల్లెవెలుగు వెబ్, రాయచోటి: మధ్యతరగతి ప్రజలకు వరంలా జగనన్న స్మార్ట్ టౌన్ షిప్- మిడిల్ ఇన్ కం గ్రూప్ లేఔట్లు ( ఎం ఐ జి ) మారుతోందని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పరిధిలో 5 జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లు తీసుకుంటే ఇందులో ఒకటి మన రాయచోటి ఉందన్నారు.ఈ పథకాన్ని ఈ నెల 20 వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారన్నారు.ఈ లే అవుట్ అప్రూవల్స్ ను అన్నమయ్య అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ వారు చేపడతారన్నారు.కాలనీ లే అవుట్ లో 30 ఏకరాలలో 294 ప్లాట్లును ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
స్థలాల వివరాలు…
36×60 ( 240 చదరపు గజాలు- 5 సెంట్లు) -100 ప్లాట్లు,ఒకొక్కటి ధర:రూ 13, 43,760,
36×50(200 చదరపు గజాలు- 4సెంట్లు)-64 ప్లాట్లు,ఒకొక్కటి ధర:రూ 11,19,800,
33×41 (150 చదరపు గజాలు- 3సెంట్లు)-78 ప్లాట్లు ఒకొక్కటి ధర: రూ 8,39,850,
అన్ లెవల్ సైజ్ ప్లాట్లు-52 ప్లాట్లును ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
చెల్లింపులు ఇలా..
ప్లాట్ పొందిన దరఖాస్తుదారులు వాయిదా పద్ధతిలో డబ్బు చెల్లించాల్సి ఉంటుందని, దరఖాస్తు సమయంలో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ 10 శాతం చెల్లించాలన్నారు.అగ్రిమెంట్ కుదుర్చుకున్న నెల రోజులకు 30 శాతం, ఆరు నెలలలోపు మరో 30 శాతం, 12 నెలలో మిగతా 30 శాతం డబ్బులను చెల్లించాల్సి ఉంటుందన్నారు.అన్నదాని కన్నా ఎక్కువ మంది లబ్దిదారులు వస్తే లాటరీ పద్ధతిన ప్లాట్లు కేటాయిస్తారన్నారు.
ఎవరు అర్హులంటే…
3 సెంట్ల స్థలానికి వార్షికాదాయం రూ 3 లక్షల నుండి 6 లక్షలు వరకు,
4 సెంట్ల స్థలానికి వార్షికాదాయం రూ 6 లక్షలు నుండి 12 లక్షలు వరకు,
5 సెంట్ల స్థలానికి రూ 12లక్షలు నుండి రూ 18 లక్షలు వరకు ఆదాయ పరిమితులు ఉండాలన్నారు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు
అన్ని సౌకర్యాలతో లేఔట్‌లు
రూ 16 కోట్ల నిధులుతో విశాలమైన 60, 40 అడుగులు రోడ్లు పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం. నీటి నిల్వ, సరఫరాకు అనుగుణంగా ఏర్పాట్లు.అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ప్రహరీ నిర్మాణం,ఎలక్ట్రికల్, కేబుల్, వీధి లైట్లు, పార్క్లు, ఇతర వసతుల కల్పన జరిగి పూర్తి నివాసయోగ్యంగా ఉంటాయన్నారు. జగనన్న కాలనీ, రాజీవ్ స్వగృహ లే అవుట్లలో సుమారు 8 వేల మంది పేదలు, మధ్యతరగతి వారికి నివాస యోగ్యాలు కలిగాయన్నారు. రాయచోటి ప్రాంతంలో ఎక్కడా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు.రాయచోటి పట్టణాన్ని నివాస యోగ్యంగా తీర్చిదిదడమే తమ ధ్యేయమన్నారు. రాయచోటి మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలకు చెందిన ఆసక్తి గలవారు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ కు దరఖాస్తు చేసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.ఇది పూర్తి ప్రభుత్వ లే అవుట్ అప్రూవల్ అని, లీగల్ డాక్యుమెంటేషన్ కూడా పూర్తి చేయిస్తుందన్నారు. ఇందుకు సంబంధించిన లే అవుట్ కు వివరాలును తెలిపే బ్రోచర్ , ఆన్ లైన్ లింక్ ను జతపరచడమైనదన్నారు.