అరుదైన వ్యాధితో బాదపడుతున్న బాలుడు… అండగా మంత్రి గుమ్మనూరు
1 min read– ‘అల్లోజెనిక్ బోన్ మార్రో ట్రాన్స్ ప్లంటేషన్’ కోసం రూ.13లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ
– ప్రాణాన్ని నిలబెట్టిన ముఖ్యమంత్రి, మంత్రికి కృతజ్ఞతలు వెల్లడించిన బాధితుడు
పల్లెవెలుగు వెబ్ అమరావతి: అరుదైన వ్యాధితో అల్లాడుతున్న పదేళ్ల వయసున్న బాలుడికి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అండగా నిలిచారు. ‘అల్లోజెనిక్ బోన్ మారో ట్రాన్స్ ప్లంటేషన్’ కోసం కావలసిన ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.13 లక్షలు మంజూరు చేయించారు.కర్నూలు జిల్లా హాలహర్వి మండలం పచ్ఛారపల్లి గ్రామానికి చెందిన జి.వినోద్ అనే బాలుడి పరిస్థితిని విన్న మంత్రి చలించిపోయారు. యుద్ధప్రాతిపదికన సీఎంఆర్ఎఫ్ చెక్కుని తెప్పించి బాధితుడికి అందజేశారు. పేదిరికం,ఆర్థిక పరిస్థితులు బాగాలేని తనకు ముఖ్యమంత్రి,మంత్రి గుమ్మనూరు ప్రాణం పోశారని వినోద్ కృతజ్ఙతలు తెలిపారు. తమ బిడ్డకు పునర్జన్మనిచ్చిన ప్రభుత్వానికి వినోద్ తల్లిదండ్రులు మనసారా అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు,వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.