క్రీడలతోనే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్
1 min read– నవనంది పాఠశాలలో క్రీడా పోటీలు .. పాఠశాలలో బాల దినోత్సవ వేడుకలు
పల్లెవెలుగు , వెబ్ నందికొట్కూరు: పట్టణ ,గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు క్రీడల్లో రాణించాలని నవనంది పాఠశాల డైరెక్టర్ బత్తుల శ్రీధర్ తెలిపారు .శుక్రవారం పట్టణంలోని నవనంది పాఠశాలలో నవంబర్ 14 జరిగే బాలల దినోత్సవ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ,క్రీడలతోనే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ,క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలని క్రీడాకారులకుసూచించారు .కబడ్డీ ,లెమన్ స్పూన్ ,మ్యూజికల్ చైర్స్, పోటీలు నిర్వహించారు . కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి .నర్సప్ప ,సి ఓ చిన్న ,వ్యాయామ ఉపాధ్యాయులు సుబ్బన్న ,రాఘవేంద్ర ,సోము తదితరులు పాల్గొన్నారు.