జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపు
1 min read
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త రెడ్డి అప్పలనాయుడు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్త, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు.. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన నాటినుండి నేటి వరకు మారుమూల గ్రామాల్లో ఏ అనారోగ్యం వచ్చిన డోలీలపై మోసుకెళ్లే పరిస్థితి ఇప్పటివరకు సాగిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణ రోడ్ల నిర్మాణ శాఖ మంత్రిగా మారుమూల గ్రామాలకు నేరుగా అంబులెన్స్ చేరుకునే విధంగా, రహదారుల నిర్మాణం చేసిన ఏకైక నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈనెల 14వ తేదీన పిఠాపురంలోని చిత్రాడాలో జరగనున్న జనసేన పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవ సభకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తగా నాకు బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఏలూరు నియోజకవర్గం నుండి ఉదయం 10 గంటలకు భారీ సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో తరలి వెళ్ళనున్నామని ఆయన తెలియజేశారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి కావలసిన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈరోజు నుంచి ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలి శెట్టి శ్రావణ్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి ఎట్రించి ధర్మేంద్ర, మీడియా ఇంచార్జ్ జనసేన రవి, నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్,అల్లు సాయి చరణ్, బోండా రామునాయుడు, బుద్ధ నాగేశ్వరరావు, కూనిశెట్టిమురళీకృష్ణ, మడుగుల మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.