ఎంపీ రఘురామకృష్ణరాజు పై కేసు నమోదు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఎంపీ రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు అయ్యింది. రఘురామ కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏ1గా రఘురామ, ఏ2 భరత్, ఏ3 సీఆర్‌పీఎఫ్ ఏఎస్సై, ఏ4 కానిస్టేబుల్ సందీప్, ఏ5 పీఏ శాస్త్రిని చేర్చారు. మరోవైపు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ భాషాపై ఎంపీ రఘురామ కృష్టంరాజు కుటుంబ సభ్యులు దాడిపై ఏపీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. రఘురామ కృష్ణం రాజు ఇంటి వద్ద ఎలాంటి పోలీసులను పెట్టలేదన్నారు. ప్రధాని పర్యటన సందర్బంగా కానిస్టేబుల్ ఐఎస్‌బీ గేట్ వద్ద స్పాటర్‌గా ఉన్నాడని తెలిపారు. కానిస్టేబుల్ ఫరూక్ విధులకు, రఘురామ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రఘురామ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఫరూక్ విధుల్లో ఉన్నాడని వెల్లడించారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని ఉన్నాతాధికారులు సస్పెండ్ చేసినట్లు ఏపీ పోలీసులు తెలిపారు.