నాటు సారా అమ్మే మహిళ పై కేసు నమోదు
1 min read– రెండు లీటర్ల సారా బాటిల్ స్వాధీనం..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఎస్పీ డి.మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్నెంట్ అరుణకుమారి ఆధ్వర్యంలో భీమడోలు స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ సుబ్రమణ్యం మరియు సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ద్వారకాతిరుమల మండలం నిమ్మకాయల యాడ్ సమీపంలో గురువారం తనిఖీ చేయుచుండగా రామిశెట్టి సావిత్రి అనే మహిళ 2 లీటర్ల సారా అమ్ముచుండగా పట్టుకోవడం జరిగిందని ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. సారా సేవించడం వల్ల ప్రాణాంతకమైన ఇబ్బందులు తలెత్తుతాయని తక్కువ ధరకే లభిస్తుందనే ఉద్దేశంతో వ్యవసాయ కూలీలు, కష్టించి పనిచేసే యువత ఇటువైపు మొగ్గు చూపుతున్నారని. దీని ద్వారా కుటుంబం చిన్న భిన్నం అవుతుందని ఈ విధంగా లభించే చీఫ్ నాటు సారా జోలికి పోవద్దని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ సుబ్రమణ్యం, ఎస్సై సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ సీతారాం, హెడ్ కానిస్టేబుల్ రెడ్డి, జి ఎం ఎస్ కె లక్ష్మీ సుజన, తదితరులు పాల్గొన్నారు.