PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేలును కొరికిన వారిపై కేసు నమోదు

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు : మండల పరిధిలోని సుంకేసుల గ్రామంలో బోట్ల బాలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాపోడు(బాలమదిలేటి),భార్య మహేశ్వరి వీరిద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మారుతి శంకర్ తెలిపారు.ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు బోట్ల బాలమదిలేటి,మహేశ్వరి వీళ్ళ ఇంటికి మెట్లు కడుతుండగా మా ఇంటి ముందు మెట్లు కడితే మేము ఎలా నడవాలని బాలమ్మ వారిని అడిగింది.మీరెవరు మా కు చెప్పడానికి మాఇష్టం వచ్చినట్లు కట్టుకుంటామంటూ బాలమ్మను మరియు ఆమె తమ్ముడు బాలమద్దిలేటిని కాళ్లతో చేతులతో తన్నారని అంతేకాకుండా భార్య భర్తలిద్దరూ కలసి బాలమ్మ ఎడమ చేయి చూపుడు వేలు ను గట్టిగా వారు కొరకడం వలన వేలు తెగి కింద పడిందని  అంతేకాకుండా బాలమ్మ తమ్ముడు అయిన బాల మద్దిలేటిని ఇటుపతో మొహం పైన కొట్టడం వల్ల అతనికి కూడా గాయమైందని చికిత్స నిమిత్తం వీరిద్దరూ మిడుతూరు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకున్న అనంతరం మెరుగైన వైద్యం కొరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

About Author