కాంగ్రెస్ పై కేసు పెడతా : కన్నడ హీరో
1 min readపల్లెవెలుగువెబ్: కాంగ్రెస్ పార్టీపై కేసు పెడతానని బెంగళూరుకు చెందిన నటుడు అఖిల్ అయ్యర్ అంటున్నాడు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ రూపొందించిన పోస్టర్లలో తన ఫొటో ఉపయోగించడంపై అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన అనుమతి లేకుండా పోస్టర్లలో తన ఫొటోను ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించాడు. బీజేపీపై కాంగ్రెస్ దాడిని పెంచడంతో బెంగళూరు అంతటా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై చిత్రంతో ‘పేసీఎం పోస్టర్లు’ వేసింది. బీజేపీ హయాంలో ప్రతీ పనికి 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపిస్తూ ‘40 శాతం సర్కార్’ అంటూ మరికొన్ని పోస్టర్లు రూపొందించింది. ఇలాంటి పోస్టర్లలో అఖిల్ అయ్యర్ ఫోటోను ఉపయోగించారు.