ఘనంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని మదనపల్లి రోడ్డు సుద్దర్వానపల్లె రోడ్డు నందు ఉన్న శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 330 ఆరాధన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త దువ్వూరు నరసింహ చారి తెలిపారు . ఈ సందర్భంగా ఆయన బ్రహ్మంగారి ఆలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ని దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ అర్థం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శ్రీ ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులను విశ్వకర్మ దంపతులకు సరస్వతీ నదీతీరంలో శ్రీ కీలకనామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి క్రీస్తుశకం 1608 వ సంవత్సరంలో జన్మించారని ఆయన తెలిపారు. స్వామి బాహ్య ప్రపంచంలో 85 సంవత్సరాలు గడిపి క్రీస్తుశకం 1693లో ముఖ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి నిష్ట వహించారని ఆయన తెలిపారు ఆనాడు నుండి ఈనాటి వరకు జగత్ కళ్యాణ కోసం యోగ నిద్ర ముద్రితులై భక్తాదుల నీరాజనాలు స్వీకరించాలని తెలిపారు సర్వమత సమ్మేళనం ద్యేయంగా కుల మతాలకు అతీతంగా అందరి మనలను పొందారని ఆలయ ధర్మకర్త తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఉపాధ్యక్షులు నాగార్జున ఆచారి ప్రధాన కార్యదర్శి నటరాజా చారి ఉపాధ్యక్షులు చెన్నూరు రత్నమాచారి ట్రెజరర్ మట్లి వెంకటరమణాచారి సహాయ కార్యదర్శి ఉత్తరాది సోమాచారి కమిటీ సభ్యులు పుర ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని తెలిపారు.