జీవో రూపంలో స్పష్టమైన హామీ ఇవ్వాలి…
1 min readఅంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్( ఏ ఐ టీ యూ సి) రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చంద్రకళ, సిఐటియు ( సిపిఎం ) నాయకులు..
పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు కనీస వేతనాలు, గ్రాట్యుటీ అమలు చేసి రిటైర్మెంట్ ప్రయోజనాలు తదితర డిమాండ్లను నెరవేరుస్తూ జీవో రూపంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్, అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చంద్రకళ అన్నారు. గురువారం పోస్ట్ కార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ సెంటర్ మీదుగా పోస్ట్ ఆఫీస్ వరకు వెళ్లి తమ సమస్యలను పోస్ట్ కార్డు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కి తెలియచేసేందుకు మూకుమ్మడిగా పోస్ట్ కార్డులను పోస్ట్ బాక్స్ లో వేసి నిరసనను తెలియజేశారు. అనంతరం చంద్రకళ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, పనికి తగ్గ వేతనం పెంచాలని గత నాలుగున్నర సంవత్సరాల నుండి అనేకసార్లు సంబంధిత అధికారులకు మంత్రులకు తెలియజేసినప్పటికీ తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోకుండా నిర్లక్ష్యం చేశారు అన్నారు. కనీస ప్రయత్నం కూడా చేయకుండా అంగన్వాడీలను అవమానిస్తూ మాట్లాడడం జరిగిందన్నారు. తమపై పని భారం మోపుతూ రకరకాల యాపులు ప్రవేశపెట్టి అనారోగ్యానికి గురి చేస్తున్నారే తప్ప కనీస జాలి కనికరం చూపలేదన్నారు. కనీసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అయిన అక్క చెల్లెమ్మలకు క్రిస్మస్ కానుకగా తమ సమస్యలకు పరిష్కారం చూస్తారని, పాదయాత్రలో చెప్పిన వరాల జల్లులను కురిపిస్తారని అనుకున్న చర్చలు విఫలం కావడం జరిగిందన్నారు. ఇప్పటికైనా మాకు ఉన్న పని భారాన్ని బట్టి వేతనాలతో పాటు డిమాండ్లను నెరవేరుస్తారని, జీవో ల రూపంలో స్పష్టమైన హామీ ఇస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోస్ట్ కార్డుల ద్వారా తెలియజేశామన్నారు. ఈ ర్యాలీలో ఏఐటీయూసీ మండల కార్యవర్గ సభ్యులు వహీదా, హసీనా, సుజాత ఇందుమతి, రహమత్, హసనమ్మ, గుర్రమ్మ, పద్మావతి, భార్గవి, జ్యోతి, మేరీ, సిఐటియు, సిపిఎం నాయకులు గుత్తి నరసింహులు, సంజమ్మ,, రజిని, రామసుబ్బమ్మ,తదితర నాయకురాలు l పాల్గొన్నారు.