NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దాతృత్వం,ధార్మిక చింతనల కలయిక…రంజాన్​

1 min read

– ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వవిప్​
పల్లెవెలుగు వెబ్​, చిట్వేలు: పవిత్ర రంజాన్​ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం సంతోషకరమని ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం రంజాన్​ పర్వదినం పురస్కరించుకుని రైల్వే కోడూరు మార్కెట్​ యార్డు, సో ఫ్యాక్టరీ వద్ద నున్న ఈద్గా మైదానంలో ముస్లిం పెద్దలతో కలిసి ప్రభుత్వ విప్​ శ్రీనివాసులు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ముస్లింలకు వైయస్సార్ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. రైల్వే కోడూరు ప్రాంతంలో 50 సంవత్సరాలుగా హైవేపై ప్రార్థన చేసుకుంటున్న ముస్లింలకు తనతో పాటు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కృషితో నేడు ఇక్కడ ఈద్గా ఏర్పాటు చేశామన్నారు. ఈద్గా వద్ద ప్రత్యేకవసతులు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ కరోనా కష్టకాలంలో ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, ముస్లిం నాయకులు అన్వర్ భాష, మస్తాన్, ముజీబ్, కరిముల్లా, ఇర్ఫాన్, ముస్లిం నాయకులు , మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author