సంతోషానికి కరువులేని దేశం.. మనుషులే కరువు !
1 min readపల్లెవెలుగు వెబ్: ఫిన్లాండ్. పశ్చిమ ఐరోపా దేశాల్లోని ఒక దేశం. ఈ దేశంలో సంతోషానికి కరువు ఉండదు. కానీ ఈ దేశంలో ప్రజలు మాత్రం ఎక్కువగా ఉండరు. ఫిన్లాండ్ జనాభా 5.2 మిలియన్లు. జనాభాలో వృద్ధుల శాతం అధికంగా ఉంది. పనిచేసే వారి సంఖ్య దేశంలో క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వలసల్ని ప్రోత్సహించాలని ఫిన్లాండ్ నిర్ణయం తీసుకుంది. ఏడాదికి కనీసం 20 వేల నుంచి 30 వేల మంది తమ దేశానికి వలసరావాల్సిన అవసరం ఉందని ఫిన్లాండ్ భావిస్తోంది. నాణ్యమైన జీవనం సాగించాలనుకునే వారికి ఫిన్లాండ్ ఒక చక్కని దేశం. ఇతర దేశాల వారికి ఫిన్లాండ్ తమ దేశంలో ఉద్యోగాలు కల్పిస్తోంది. కరోన నేపథ్యంలో ఇతర దేశాల వారు ఫిన్లాండ్ వదిలి వెళ్లారు. హ్యాపీనెస్ ఇండెక్స్ ను ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఓ కమిటీ ఏర్పాటు చేసి..ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాను నిర్ణయిస్తుంది. ఆ జాబితాలో ఫిన్లాండ్ గత నాలుగేళ్లుగా మెదటి స్థానంలో ఉంది. ఆయా దేశాల జీడీపీ, సోషల్ సెక్యూరిటీ, దాతృత్వం, ప్రజా నిర్ణయాల్లో స్వతంత్రత, లంచగొండితనం తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని హ్యాపీనెస్ ఇండెక్స్ ను తయారు చేస్తారు.